ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27ఏళ్ల పాటు శీతలీకరణ స్థితిలో ఉన్న పిండం.. పసిపాపగా..!

ABN, First Publish Date - 2020-12-03T00:22:30+05:30

అమెరికాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 27ఏళ్ల పాటు శీతలీకరణ స్థితిలో ఉన్న పిండం.. పసిపాపగా ప్రాణం పోసకుంది. వివరాల్లోకి వెళితే.. టెనెస్సీ రాష్ట్రానికి చెందిన టీనా, గిబ్సన్ దంపతులు 2

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 27ఏళ్ల పాటు శీతలీకరణ స్థితిలో ఉన్న పిండం.. పసిపాపగా ప్రాణం పోసకుంది. వివరాల్లోకి వెళితే.. టెనెస్సీ రాష్ట్రానికి చెందిన టీనా, గిబ్సన్ దంపతులు 27ఏళ్లుగా శీతలీకరణ స్థితిలో ఉన్న పిండంకు జీవం పోశారు. 1992లో శీతలీకరణ స్థితిలో భద్రపరిచిన పిండాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో టీనా, గిబ్సన్ దంపతులు దాత నుంచి అడాప్ట్ చేసుకున్నారు. అనంతరం వైద్యులు ఆ పిండాన్ని టీనా గర్భంలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆమె గత నెలలో పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆ దంపతులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా.. ఈ విషయంపై స్పందించిన నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్ దీన్ని ఒక రికార్డుగా అభివర్ణించింది. 27ఏళ్లపాటు శీతలీకరణ స్థితిలో ఉన్న పిండం ప్రాణం పోసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు లేవని తెలిపింది. 


Updated Date - 2020-12-03T00:22:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising