ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లోరిడాలో భయానక పరిస్థితి.. ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్స్ ఫుల్

ABN, First Publish Date - 2020-07-20T07:53:31+05:30

అమెరికాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. ముఖ్యంగా ఫ్లోరిడాలో పరిస్థితి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్లాండో: అమెరికాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. ముఖ్యంగా ఫ్లోరిడాలో పరిస్థితి అదుపు తప్పుతోంది. నిత్యం పదివేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటంతో ఆసుపత్రులు మొత్తం కరోనా పేషంట్లతోనే నిండిపోతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు చూసుకుంటే.. ఫ్లోరిడా వ్యాప్తంగా 49 ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్స్ ఫుల్ అయిపోయాయి. మరోపక్క ఫ్లోరిడాలో శనివారం 12,478 కేసులు, 87 మంది మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,50,047కు చేరింది. ఇక మరణాల సంఖ్య 4,982గా ఉంది. జులై నెలలో ఫ్లోరిడాలో 12 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇది నాలుగో సారి. ముఖ్యంగా యువత ఫేస్‌మాస్క్ ధరించకుండా రోడ్లపైకి రావడం వల్లే కరోనా వ్యాప్తి చెందుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారాయి. ఈ రాష్ట్రాల్లో నిత్యం పదివేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. కాగా.. జాన్స్ హాప్కిన్స్ లెక్కల ప్రకారం.. అమెరికాలో 37 లక్షలకు పైగా కేసులు నమోదవగా.. లక్షా 40 వేలకు పైగా కరోనా కారణంగా మరణించారు.


Updated Date - 2020-07-20T07:53:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising