ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్నెట్‌లో ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’

ABN, First Publish Date - 2020-05-28T08:31:51+05:30

‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ను ఇంటర్నెట్‌ ద్వారా నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి, పూర్వ అధ్యక్షుడు ప్రసాద్‌ తోటకూర ప్రకటించారు. మొద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ను ఇంటర్నెట్‌ ద్వారా నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి, పూర్వ అధ్యక్షుడు ప్రసాద్‌ తోటకూర ప్రకటించారు. మొదటి సమావేశం ఈ నెల 31న రాత్రి 9.30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11గంటలకు) జరుగుతుందని, ప్రముఖ జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని వివరించారు. దీనిద్వారా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో తానా మరో ముందడుగు వేయనుందని పేర్కొన్నారు. ఇకపై ప్రతినెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇంటర్నెట్‌లో దీనిని నిర్వహిస్తామన్నారు. సాహిత్య సభలు, సమావేశాలు, కవిసమ్మేళనాలు, చర్చలు, అవధానాలతో పాటు కథలు, కవితలు, ఫొటో కవితలు, పద్యాలు, పాటలు, బాలసాహిత్యం తదితర అంశాల్లో అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తామన్నారు. వెబ్‌ఎక్స్‌ లింక్‌ http-s://tana.webex.com/tana/j.ph-p?MTID=md6320421e1988f9266591b0ce5f8ee40 ద్వారా గానీ ఫేస్‌బుక్‌ ద్వారా గానీ ఫోన్‌ ద్వారా అయితే యూఎ్‌సఏ: 1-408-418-9388 యాక్సెస్‌ కోడ్‌: 798 876 407 మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రియులందరూ దీనిలో పాల్గొనవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు www.tana.org  వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Updated Date - 2020-05-28T08:31:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising