ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాన్‌ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ‘టెంపరరీ షెల్టర్‌ ఇన్‌ ప్లేస్‌’

ABN, First Publish Date - 2020-03-19T14:07:15+05:30

ఎప్పుడూ ఆనందాల హరివిల్లుగా కనిపించే ఇల్లు! ఇప్పుడేంటో దానినే ‘జైలు’ అంటున్నారు. ఒక్కరోజు సెలవు దొరికితే ఎగిరి గంతులేసే పిల్లలు! ‘ఆశించని సెలవులతో’... ముభావంగా ఉంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎప్పుడూ ఆనందాల హరివిల్లుగా కనిపించే ఇల్లు!  ఇప్పుడేంటో దానినే ‘జైలు’ అంటున్నారు. ఒక్కరోజు సెలవు దొరికితే ఎగిరి గంతులేసే పిల్లలు! ‘ఆశించని సెలవులతో’... ముభావంగా ఉంటున్నారు. ఇది... కరోనా ఎఫెక్ట్‌! వైరస్‌ తీవ్రతను నియంత్రించడంలో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ‘టెంపరరీ షెల్టర్‌ ఇన్‌ ప్లేస్‌’ ఆదేశాలు అమలు చేశారు. అంటే... ఎవరి ఇళ్లలో వారు ఉండటం! భారతీయులు, అందులోనూ తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతమిది! ఈ గృహ నిర్బంధం, స్థానిక పరిస్థితులను అక్కడ నివసిస్తున్న కరీంనగర్‌కు చెందిన స్పీచ్‌ థెరపిస్ట్‌ కవితా హెర్లె ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. 


కరోనాతో ప్రపంచం పోరాడుతోంది. మేం ఉం టున్న బే ఏరియా ప్రాంత యంత్రాంగం మరింత కఠినమైన నిర్ణయాలే తీసుకుంది. ‘ఎవరి ఇళ్లలో వారు ఉం డిపోండి’... అని ఆదేశాలు జారీ చేసింది. ఒక్కసారిగా అంతా గందరగోళం, అయోమయం! అత్యంత అవసరమైన పని ఉంటే తప్ప ఇంటి గడప దాటొద్దు. బయటి కి వచ్చినా... ఒకరికొకరు కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండాలి. పది మందికంటే ఎక్కువ మంది గుమికూడవద్దు. సెలవులు దొరికాయి కదా.. స్నేహితులతోనో, బంధువులతోనే సరదాగా గడిపేద్దామంటే అదీ కుదరదు. ఎవరు ఎవరినీ పిలవద్దు. ఎవరి ఇళ్లకూ వెళ్లొద్దు.


ఇక... సినిమా థియేటర్లు, బార్లు, రెస్టారంట్ల సంగతి మరిచిపోవాల్సిందే. మా ప్రాంతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. మొన్నటిదాకా స్వేచ్ఛగానే ఉ న్నాం. స్కూళ్లు, రెస్టారెంట్లు తెరిచే ఉన్నాయి. మేం చేసిందల్లా... హ్యాండ్‌ శానిటైజర్‌ను తరచూ వాడటం, ఇతరుల నుంచి దూరంగా ఉండటం! ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ‘షెల్టర్‌ ఇన్‌ ప్లేస్‌’ అనగానే అందరిలో ఒకరకమైన ఆందోళన! హుటాహుటిన స్టోర్స్‌కు వెళ్లి... కట్టలు కట్టలుగా టాయ్‌లెట్‌ పేపర్‌ కొన్నారు. అవసరానికి మించి, అందరూ ఒకేసారి కొనుగోళ్లు చేస్తుండటం తో కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, ఇతర నిత్యావసరాలకు సరఫరా తగ్గిపోయింది. రెస్టారెంట్లలో ‘టేక్‌ ఔట్‌’ మాత్రమే అనుమతించారు. 


సెలవులు ఇచ్చినా బయటికి వెళ్లనివ్వకపోవడంతో పిల్లలు ‘బోర్‌ కొడుతోంది మమ్మీ’ అంటున్నారు. బయటికి వెళ్లనివ్వకపోవడంతో వాళ్ల స్వేచ్ఛకు సంకెళ్లు వేసినట్లయింది. అన్నింటికంటే ముఖ్యంగా... ‘ఏదో ఘోరం జరుగుతోంది’ అనే యాంగ్జైటీ వారిలో పెరిగిపోతోంది. కొన్నిస్కూళ్లు ‘ఆన్‌లైన్‌’లో  క్లాసులు చెబుతున్నాయి.  ఇక... ఏరోజుకా రోజు ఉద్యోగాలకు వెళ్లి సంపాదించుకునే వారు ప్రభుత్వం ఇచ్చే  ‘నిరుద్యోగ భృతి’ని కోరుకుంటున్నారు. ఒంటరిగా ఉండే వృద్ధులకు వలంటీర్లు సహకరిస్తున్నారు. వృద్ధుల కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు... కరోనా భయపెడుతున్నా గ్రాసరీ స్టోర్స్‌ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుని పని చేస్తూనే ఉన్నారు. అందరి ఆకాంక్ష ఒక్కటే... కరోనా మహమ్మారి వెళ్లిపోవాలి!

Updated Date - 2020-03-19T14:07:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising