ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్.. ప్రపంచ ప్రఖ్యాత రెస్టారెంట్ కాస్తా..!

ABN, First Publish Date - 2020-05-23T23:20:10+05:30

డేనియల్.. మొన్నటి వరకు అతనో ప్రపంచ ప్రఖ్యాత రెస్టారెంట్‌లో చెఫ్. అంతేకాదు ఆ రెస్టారెంట్‌కు యజమాని కూడా. అయితే ఇప్పడు మాత్రం.. నిరుపేదలపాలిట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: డేనియల్.. మొన్నటి వరకు అతనో ప్రపంచ ప్రఖ్యాత రెస్టారెంట్‌లో చెఫ్. అంతేకాదు ఆ రెస్టారెంట్‌కు యజమాని కూడా. అయితే ఇప్పడు మాత్రం.. నిరుపేదలపాలిట అతను దైవం. ప్రపంచ ప్రఖ్యాత రెస్టారెంట్‌ ఇప్పడు ఛారిటీ కిచెన్‌గా మారిపోవడమే అందుకు కారణం. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యంలో కూడా దీని ఉదృతి కొనసాగుతుండటంతో.. అమెరికాలో స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. దేశ వ్యాప్తంగా రెస్టారెంట్‌లు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. కోట్లాది మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయారు. కనీసం ఒక్కపూట కూడా తిండి దొరకని నిరుపేదల సంఖ్య పెరిగిపోయింది. అమెరికాకు ఆర్థిక రాజధానిగా భావించే న్యూయార్క్‌ సిటీలోనే ప్రతి నలుగురిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారంటూ స్వయంగా ఆ నగర మేయరే ప్రకటించారంటే అక్కడ పరిస్థతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లోని ప్రముఖ ఎలెవన్ మాడిసన్ పార్క్ రెస్టారెంట్.. ఛారిటీ కిచెన్‌గా మారిపోయింది. న్యూయార్క్‌లోని ఎలెవన్ మాడిసన్ పార్క్ రెస్టారెంట్‌కు‌.. 2017లో ప్రపంచ అత్యుత్తమ మొదటి 50 రెస్టారెంట్‌ల జాబితాలో చోటు దక్కింది. అయితే ప్రపంచ అత్యుత్తమ రెస్టారెంట్‌లలో ఒకటైన ఎలెవన్ మాడిసన్ పార్క్‌ను .. ఆ రెస్టారెంట్ యజమాని, చెఫ్ డేనియల్.. ఛారిటీ కిచెన్‌గా మార్చేశాడు. లాక్‌డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదల కడుపు నింపేందుకు పూనుకున్నాడు. ప్రతిరోజు దాదాపు 3వేల మందికి సరిపడా ఆహార పదార్థాలను తయారు చేయించి, స్వచ్ఛంద సంస్థల సహకారంతో న్యూయార్క్‌లోని వివిధ ప్రదేశాల్లోని పేదలకు అందిస్తున్నారు. కాగా.. విపత్కర పరిస్థితుల్లో పేదల ముఖంలో నవ్వులు చూడటానికే రెస్టారెంట్‌ను ఛారిటీ కిచెన్‌గా మార్చినట్లు డేనియల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. న్యూయార్క్‌లో ఇప్పటి వరకు 3.67లక్షల మందికి కరోనా వైరస్ సోకగా.. ఈ మహమ్మారికి దాదాపు 29వేల మంది బలయ్యారు.  


Updated Date - 2020-05-23T23:20:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising