ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరిజోనా జైలులో 500 మందికి పైగా ఖైదీల‌కు క‌రోనా !

ABN, First Publish Date - 2020-08-06T19:32:27+05:30

అగ్ర‌రాజ్యం అమెరికాను మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ ప‌లు రాష్ట్రాల్లో భారీగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరిజోనా: అగ్ర‌రాజ్యం అమెరికాను మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ ప‌లు రాష్ట్రాల్లో భారీగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా అరిజోనా రాష్ట్రంలోని ఓ జైలులో ఏకంగా 500 మందికి పైగా ఖైదీల‌కు కోవిడ్ సోకిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఎఎస్‌పీసీ-టక్సన్ వీట్‌స్టోన్ జైలులో 517 మందికి క‌రోనా పాజిటివ్‌గా వ‌చ్చింద‌ని అరిజోనా డిపార్ట్మెంట్ ఆఫ్ ది కరెక్షన్స్, రిహాబిలిటేషన్ అండ్ రీఎంట్రీ(ఏడీసీఆర్ఆర్‌) తెలిపింది. దీంతో బాధితుల‌ను ప్ర‌త్యేక‌ గ‌దుల్లో ఉంచి చికిత్స అందిస్తున్న‌ట్లు పేర్కొంది. వారు పూర్తిగా కోలుకునేంత వ‌ర‌కు మిగ‌తా ఖైదీలతో క‌లిసేందుకు అనుమ‌తి ఇవ్వ‌బోమ‌ని అధికారులు తెలియ‌జేశారు. కాగా, వీట్‌స్టోన్ యూనిట్‌లో ప్రస్తుతం 1,066 మంది ఖైదీలు ఉన్నారు.


ఇక యూఎస్‌లో క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో అరిజోనా కూడా ఒక‌టి. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రాష్ట్రంలో 1,82,203 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా... 3,932 మందిని ఈ మ‌హ‌మ్మారి బ‌లిగొంది. అలాగే అమెరికా వ్యాప్తంగా మొత్తం 49.70 ల‌క్ష‌ల కోవిడ్ కేసులు నమోద‌య్యాయి. 1.60 ల‌క్ష‌ల మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాల్లో అగ్ర‌రాజ్యం అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది.        

Updated Date - 2020-08-06T19:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising