ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురిని పోగొట్టుకున్నా.. భౌతిక దూరం పాటించండి.. అమెరికాలో..

ABN, First Publish Date - 2020-04-02T23:53:19+05:30

ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ ఒహాయోకు చెందిన కెల్లీ అనే మహిళ విజ్ఞప్తి చేస్తోంది. కరోనా బారిన పడి వారం రోజుల వ్యవధిలో తన కుటుంబంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రోవ్ సిటీ, ఒహాయో: ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ ఒహాయోకు చెందిన కెల్లీ అనే మహిళ విజ్ఞప్తి చేస్తోంది. కరోనా బారిన పడి వారం రోజుల వ్యవధిలో తన కుటుంబంలో ముగ్గురు చనిపోయారని, ఈ పరిస్థితి ఎవరికి రాకూడదని కెల్లీ కోరుకుంటోంది. ఒహాయోలోని గ్రోవ్ సిటీకి చెందిన కెల్లీ.. తన తల్లి, తండ్రి, సోదరుడిని కోల్పోయింది. ప్రస్తుతం తన భర్త కూడా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నట్టు పేర్కొంది. తన సోదరుడు అనారోగ్యంతో ఉన్న తల్లిని చూడటానికి వచ్చి కరోనా బారిన పడినట్టు కెల్లీ చెప్పింది. ఇంటికి వచ్చిన మరుసటి రోజే తన సోదరుడికి కరోనా లక్షణాలు రావడం మొదలయ్యాయని.. వెంటనే పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ తేలినట్టు తెలిసిందని పేర్కొంది. కాగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన తన సోదరుడు గత ఆదివారం మరణించాడని కెల్లీ ఆవేదనను వెల్లగక్కింది. ప్రస్తుతం తాను సెల్ప్ ఐసోలేషన్‌లోనే ఉన్నానని.. ఇంటి నుంచే తన భర్త కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెబుతోంది. కాగా.. అమెరికాను కరోనా మహమ్మారి ఏ విధంగా కబళిస్తోందో చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. అయినప్పటికి అమెరికాలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలను అమలు చేయడం లేదు. దీంతో ఏ నిమిషాన ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-04-02T23:53:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising