ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూయార్క్‌లో తొమ్మిదో రోజు కూడా.. ఒక శాతం కంటే తక్కువగానే..

ABN, First Publish Date - 2020-08-17T06:30:34+05:30

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్, మే నెలల్లో అయితే అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం కరోనాకు కేంద్రంగా ఉండేది. అయితే ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రస్తుతం న్యూయార్క్‌లో కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చింది. గత తొమ్మిది రోజుల నుంచి న్యూయార్క్‌లో కరోనా పాజిటివ్ రేటు ఒక శాతం కంటే తక్కువగానే ఉంటోంది. శనివారం కూడా పాజిటివ్ రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉందని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో వెల్లడించారు. శనివారం న్యూయార్క్ వ్యాప్తంగా 607 కరోనా కేసులు నమోదుకాగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 70 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్టు గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. కాగా.. కొత్తగా నమోదైన కేసులతో న్యూయార్క్‌లో మొత్తం కేసుల సంఖ్య 4,55,429కు చేరుకుంది. మరోపక్క మొత్తం మరణాలు సంఖ్య 32,901గా ఉంది. అమెరికాలో అత్యధిక కరోనా మరణాలు న్యూయార్క్‌లోనే చోటుచేసుకున్నాయి. ఇక అమెరికా వ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు 55,46,622 కేసులు నమోదు కాగా.. కరోనా బారిన పడి 1,72,870 మంది మృత్యువాతపడ్డారు.   

Updated Date - 2020-08-17T06:30:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising