ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్ నిర్ణయాల కారణంగానే తల్లికి పోగొట్టుకున్నా: న్యూయార్క్ అధికారి

ABN, First Publish Date - 2020-04-08T02:40:39+05:30

ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగానే న్యూయార్క్‌లో పరిస్థితి ఇలా ఉందంటూ న్యూయార్క్‌కు చెందిన సీనియర్ అధికారి స్కాట్ స్ట్రింగర్ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగానే న్యూయార్క్‌లో పరిస్థితి ఇలా ఉందంటూ న్యూయార్క్‌కు చెందిన సీనియర్ అధికారి స్కాట్ స్ట్రింగర్ మండిపడ్డారు. కరోనా కారణంగా ఎంతో ప్రేమగా చూసుకుంటూ వస్తున్న తన తల్లిని కూడా పోగొట్టుకున్నానని స్కాట్ ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ చేతులకు అంటుకున్న రక్తంలో తన తల్లి రక్తం కూడా ఉందని ఆయన అన్నారు. ట్రంప్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఉంటే అమెరికా ఇలా ఉండేది కాదంటూ ఆయన అభిప్రాయపడ్డారు. కరోనాను సీరియస్‌గా పరిగణించి ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి ఉంటే.. వెంటనే చర్యలు తీసుకుని ఉండేవారన్నారు. నెలల పాటు సమయాన్ని వృధా చేసి, కరోనా అసలు సమస్యే కాదన్న  విధంగా ప్రవర్తిస్తూ వచ్చారన్నారు. 


కాగా.. స్కాట్ తల్లి ఆర్లెన్(86) కరోనా బారిన పడి గత శుక్రవారం మృతి చెందారు. తన తల్లి ఎంతో కష్టపడి తమను పెంచిందని, జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందని స్కాట్ గుర్తుచేశారు. ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా న్యూయార్క్ సిటీ కౌన్సిల్‌లో ప్రాతినిథ్యం వహించిన మొదటి మహిళ తన తల్లేనంటూ చెప్పుకొచ్చారు. తాను నేడు ఈ స్థితిలో ఉండటానికి తన తల్లి పెంపకం, నేర్పిన విలువలే కారణమని స్కాట్ అన్నారు. కాగా.. న్యూయార్క్‌లో రేయింబవళ్లు ఆసుపత్రుల్లో గడుపుతున్న వైద్యులకు, అత్యవసర సేవలకు హాజరవుతున్న వారికి స్కాట్ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2020-04-08T02:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising