ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూయార్క్ నగరంలో సోమవారం నుంచి మరిన్ని సడలింపులు

ABN, First Publish Date - 2020-06-22T07:49:06+05:30

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్:  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. మరోపక్క అమెరికాలో అత్యధిక కేసులు న్యూయార్క్‌ నుంచే నమోదయ్యాయి. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 23,49,884 కరోనా కేసులు నమోదైతే.. ఇందులో 4,11,009 కేసులు ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో మృతదేహాలను పూడ్చడానికి కూడా స్థలం దొరకలేదంటే న్యూయార్క్‌లో ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు న్యూయార్క్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. న్యూయార్క్ నగరంలో కూడా కరోనా వ్యాప్తి చాలా వరకు తగ్గడంతో లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చారు. మొదటి విడతలో భాగంగా సడలింపులు ఇచ్చిన తరువాత కూడా కేసులు భారీగా పెరగకపోవడంతో ఇప్పుడు రెండో విడత సడలింపులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఒక శాతం కంటే తక్కువగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. శనివారం న్యూయార్క్ వ్యాప్తంగా 664 కరోనా కేసులు నమోదైనట్టు, 15 మంది మరణించినట్టు ఆయన చెప్పారు. కరోనా మహమ్మారితో పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉందని.. జాగ్రత్తలు తీసుకుంటూనే న్యూయార్క్‌లో సడలింపులు ఇచ్చుకుంటూ వెళ్తామని ఆయన చెప్పారు. కాగా.. సోమవారం నుంచి న్యూయార్క్ నగరంలో రెండో విడత సడలింపులు ఇవ్వనున్నారు.

Updated Date - 2020-06-22T07:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising