ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలిఫోర్నియాను వ‌ణికిస్తున్న‌‌ పిడుగుపాట్లు.. 72 గంట‌ల్లో‌..

ABN, First Publish Date - 2020-08-20T19:29:01+05:30

అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియాలో పిడుగుపాట్లు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియాలో పిడుగుపాట్లు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. కేవ‌లం 72 గంట‌ల వ్య‌వ‌ధిలోనే 11వేల పిడుగుపాట్ల‌తో 367 చోట్ల మంట‌లు అంటుకున్నాయి. భారీ సంఖ్య‌లో గృహాలు ధ్వంసం అయ్యాయి. దీంతో వేలాది మందిని అధికారులు ఇళ్లు ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. గ‌త ద‌శాబ్ద కాలంలో ఇదే అతిపెద్ద విప‌త్తు అని కాలిఫోర్నియా గ‌వ‌ర్న‌ర్ గేవిన్ న్యూస‌మ్ పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.


ఇక 367 చోట్ల అగ్ని కిలలు విస్తరించడంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాప‌క సిబ్బంది ప్ర‌య‌త్నిస్తోంది. మరోవైపు సెంట్రల్ కాలిఫోర్నియా అడవుల్లో చెల‌రేగిన కార్చిచ్చును ఆర్పబోయిన హెలీకాఫ్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలిపోవడంతో ఫైలట్ మృతి చెందారు. మంగళవారం ప్రారంభమైన పిడుగుపాట్లు శాంటా క్లారా, అల్మెడ, కాంట్రా కోస్టా, శాన్ జోక్విన్ మరియు స్టానిస్లాస్ కౌంటీలలో 85,000 ఎకరాలకు పైగా అట‌వీ ప్రాంతాన్ని కాల్చి బూడిద‌ చేసింది. 


Updated Date - 2020-08-20T19:29:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising