ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాలస్‌లో ఫుడ్ బ్యాంక్‌కు నాట్స్ సాయం

ABN, First Publish Date - 2020-06-01T06:36:50+05:30

కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాలస్: కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) అమెరికాలోని పలు నగరాల్లో తనవంతు సాయం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా డాలస్ నాట్స్ విభాగం 2000 ఫుడ్ క్యాన్స్‌ను నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్‌కు విరాళంగా అందించింది. నాట్స్ ఫుడ్ డ్రైవ్ ద్వారా ఈ ఫుడ్ క్యాన్స్ సేకరించి ఫుడ్ బ్యాంక్‌కు అందించింది. నిరుపేదలు ఎవరూ ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతో నాట్స్ అనేక చోట్ల అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోంది. నాట్స్ ఉపాధ్యక్షులు బాపు నూతి సహకారంతో డాలస్ చాప్టర్ కోఆర్డినేటర్ అశోక్ గుత్తా, సెక్రటరీ డి.వి.ప్రసాద్, కోశాధికారి సురేంద్ర ధూళిపాళ్ల ఈ ఫుడ్ డ్రైవ్‌లో కీలక పాత్ర పోషించారు. నాట్స్ ఉపాధ్యక్షులు బాపు నూతి,  విజయ్ శేఖర్ అన్నే, నేషనల్ కో ఆర్డినేటర్ జ్యోతి వనం, బోర్డు డైరెక్టర్లు ఆది గెల్లి, కిషోర్ వీరగంథం, నాట్స్ డాలస్ విభాగం నాయకులు అశోక్ గుత్తా, డీవీ ప్రసాద్, సురేందర్ దూళిపాళ్ల, కవిత దొడ్డా, శ్రీథర్ న్యాలమడుగుల, రవి తాండ్ర, భాను లంక, సత్య శ్రీరామినేని, శ్రీనివాస్ పాటిబండ్ల, మార్క్ వనం, వెంకట్ దొడ్డా, యూత్  టీం సభ్యులు జషిత్ వనం, రేహాన్ న్యాలమడుగుల తదితరులు ఈ ఫుడ్ డోనేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2020-06-01T06:36:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising