ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్ డిస్టాన్సింగ్ బదులుగా సోషల్ ఫిష్టాన్సింగ్.. అమెరికాలో..

ABN, First Publish Date - 2020-03-27T06:04:03+05:30

కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేలా ప్రతిఒక్కరు ఆరు అడుగుల దూరం పాటించాలని ఏ దేశానికాదేశం ప్రజలకు చెబుతూ వచ్చాయి. దీన్నే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాంటానా: కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేలా ప్రతిఒక్కరు ఆరు అడుగుల దూరం పాటించాలని ఏ దేశానికాదేశం ప్రజలకు చెబుతూ వచ్చాయి. దీన్నే సోషల్ డిస్టాన్సింగ్‌‌గా పిలవడం కూడా మొదలుపెట్టారు. అయితే అమెరికాలోని మాంటానా రాష్ట్రంలో మాత్రం సోషల్ డిస్టాన్సింగ్‌ను వేరే విధంగా పిలుస్తున్నారు. మాంటానాలోని ఫిష్, వైల్డ్ లైఫ్ అండ్ పార్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు కరోనా వ్యాధికి సంబంధించిన సూచనలను ప్రజలకు వినూత్న రీతిలో చేరవేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే సోషల్ డిస్టాన్సింగ్‌ పేరును.. సోషల్ ఫిష్‌టాన్సింగ్‌గా నామకరణం చేశారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే.. సోషల్ డిస్టాన్సింగ్‌లో ఆరు అడుగుల దూరాన్ని మామూలుగా కొలవాల్సి ఉంటుంది. అదే సోషల్ ఫిష్‌టాన్సింగ్ విషయానికి వస్తే దూరం అనేది చేపల సైజు బట్టి ఉంటుంది. 


స్పష్టంగా చెప్పాలంటే.. మాంటానాలో ట్రౌట్, షోవెల్ నోజ్ స్టర్జియాన్, ప్యాడిల్ ఫిష్ తదితర రకాల చేపలు ఉన్నాయి. ప్రజలు ఆరు అడుగుల దూరాన్ని ఈ చేపల సైజులతో పోల్చుకుంటూ పాటిస్తే సరిపోతుంది. వైల్డ్ లైఫ్ అధికారులు తమ ట్విటర్ ఖాతాలో ఏం రాసుకొచ్చారంటే.. ‘మీరు బయటకు వెళ్తుంటే ఆరు అడుగుల దూరాన్ని ఇలా పాటించండి’ అని రాసి ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో ఇద్దరు మనుషుల మధ్య పలు రకాల చేపలు ఉన్నాయి. ఫొటోను గమనిస్తే.. నాలుగు ట్రౌట్ చేపలు, రెండు షోవెల్‌నోజ్ స్టర్జియాన్ చేపలు, ఒక ప్యాడిల్ ఫిష్, ఒక ఫిషింగ్ రాడ్ ఇద్దరు మనుషుల మధ్య ఆరు అడుగులను సూచిస్తున్నాయి. వీటిని చూసిన మాంటానా నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ చేపలు ఇంత సైజు ఉంటాయని తమకు ఇప్పటివరకు తెలియదని కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - 2020-03-27T06:04:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising