ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుటుంబసభ్యులకు కరోనా సోకుతుందేమోనని.. అమెరికాలో ఓ డాక్టర్..

ABN, First Publish Date - 2020-04-06T04:41:04+05:30

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా కబళిస్తోందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెఫర్‌సిన్ సిటి, మిస్సౌరి: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా కబళిస్తోందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అమెరికాలోని వైద్యులు రేయింబవళ్లు ఆసుపత్రులలోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క విశ్రాంతి తీసుకోడానికి ఇంటికి వచ్చినా.. కుటుంబసభ్యులకు కరోనా సోకుతుందేమోనని భయపడుతున్నారు. రోజంతా కరోనా బాధితులతో గడిపే వైద్యులు తమకు కరోనా సోకి.. అది కుటుంబసభ్యులకు కూడా వ్యాప్తి చెందుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగానే మిస్సౌరి రాష్ట్రంలోని డాక్టర్ టిఫనీ ఆస్బన్ అనే వైద్యురాలు తన ఇంటి పార్కింగ్‌లోనే విశ్రాంతి తీసుకుంటూ వస్తున్నారు. తమ ఇంట్లో ఉన్న క్యాంపర్ వ్యాన్‌లోనే తాను నిద్రపోతున్నానని.. కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ వస్తున్నానని టిఫనీ వివరించారు. తన కుటుంబసభ్యులు కూడా తనకు మద్దతుగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. మొదట హోటల్‌లో ఉందామని అనుకున్నానని, కానీ కరోనా నేపథ్యంలో హోటళ్లు కూడా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టిఫనీ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఇంతమందికి వైద్యం చేయడం గర్వంగా ఫీలవుతున్నానని, ప్రజలకు సేవ చేయడానికే తాము వైద్య కోర్సు చేశామన్నారు. అయితే ఒకేసారి ఇంత మందికి వైద్యం చేసే సందర్భం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. తన కుటుంబంతో సమయం గడపడం లేదనే బాధ తప్ప తనకు మరే ఇబ్బంది లేదని టిఫనీ చెబుతున్నారు.

Updated Date - 2020-04-06T04:41:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising