ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్క్‌లో పర్సు.. అందులో రూ. 40,000.. ఇద్దరు యువకులు..

ABN, First Publish Date - 2020-08-10T08:42:42+05:30

మిచిగాన్‌లోని వేల్యాండ్‌కు చెందిన ఇద్దరు యువకులు తమకు దొరికిన పర్సును పోలీసులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేల్యాండ్: మిచిగాన్‌లోని వేల్యాండ్‌కు చెందిన ఇద్దరు యువకులు తమకు దొరికిన పర్సును పోలీసులకు అప్పగించి తమ మంచితనాన్ని చాటుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లోగాన్ మిషో(14), ఆస్టిన్ నికోల్స్(13) సేదతీరడానికి హాప్కిన్స్‌లోని మున్సిపల్ పార్క్‌కు వెళ్లారు. వారు కూర్చున్న బెంచ్‌పైనే ఓ పర్సు కనిపించింది. తెరిచి చూడగా.. 550 డాలర్లు(41,233) ఉన్నాయి. చుట్టుపక్కల ఎవరూ లేకపోయినప్పటికి..  ఆ డబ్బును వారు తీసుకోకుండా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ పర్సును అప్పగించారు. దీంతో పోలీసు అధికారులు ఇద్దరు యువకులను అభినందించారు. ఆ పర్సు జాసన్ అనే వ్యక్తిది అని.. పార్క్‌లో లంచ్ చేసిన సమయంలో బెంచ్‌పై పర్సు మర్చిపోయినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఇక యువకుల మంచితనానికి మెచ్చి పోలీసు అధికారులు వారికి 50 డాలర్ల(రూ. 3,748) బహుమతిని ఇచ్చారు. పార్క్‌లో అందరూ చూస్తుండగా పర్సు దొరికితే వేరే విషయమని.. అయితే ఎవరూ లేకపోయినప్పటికి ఇద్దరు యువకులు నిజాయితీగా పర్సును తమకు అప్పగించడం నిజంగా అభినందనీయమని పోలీసులు కొనియాడారు.

Updated Date - 2020-08-10T08:42:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising