ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్ లేకుండా వాల్‌మార్ట్‌కు వెళ్లడమే కాకుండా.. ఫ్లోరిడాలో..

ABN, First Publish Date - 2020-06-24T03:37:27+05:30

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ వ్యక్తి ఫేస్‌మాస్క్ లేకుండా వాల్‌మార్ట్ లోపలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్లాండో: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ వ్యక్తి ఫేస్‌మాస్క్ లేకుండా వాల్‌మార్ట్ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. మాస్క్ లేకుంటే లోపలికి అనుమతించేది లేదంటూ సెక్యూరిటీ గార్డ్ చెప్పడంతో.. అతడిని తోసుకుంటూ లోపలకు వెళ్లేందుకు వ్యక్తి యత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాంది. గత శనివారం ఫ్లోరిడాలోని ఆర్లాండోలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పైనున్న వీడియోను గమనిస్తే.. మాస్క్ లేని వ్యక్తి సెక్యూరిటి గార్డ్‌ను తోయబోయి తాను కింద పడటం గమనించవచ్చు. లోపలకు వెళ్లొద్దంటూ సెక్యూరిటి గార్డ్ ఎంత మొత్తుకున్నప్పటికి అతడు మాత్రం లోపలకు వెళ్తూనే ఉండటం వీడియోలో చూడవచ్చు. అయితే చివరకు ఆ వ్యక్తి బయటకు వెళ్లేందుకు అంగీకరించాడని వాల్‌మార్ట్ సిబ్బంది చెప్పారు. బయటకు వెళ్లేముందు ఆ వ్యక్తి లోపల అనేక చోట్ల ఉమ్మి వేశాడని సిబ్బంది చెబుతున్నారు. కాగా.. ఫ్లోరిడాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి పెరగడంతో అధికారులు ఫేస్ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. ఫ్లోరిడాలో ఇప్పటివరకు మొత్తంగా 1,03,503 కరోనా కేసులు నమోదు కాగా.. కరోనా బారిన పడి 3,238 మంది మరణించారు. ఫ్లోరిడా నుంచి న్యూయార్క్ వచ్చే వారిని రెండు వారాల పాటు క్వారంటైన్‌కు కూడా పంపిస్తామంటూ ఇటీవల న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో అన్నారు.


Video SOurce: CGTN

Updated Date - 2020-06-24T03:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising