ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమించిన యువతిని ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న కరోనా బాధితుడు!

ABN, First Publish Date - 2020-08-19T05:30:00+05:30

కరోనా బారినపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి.. బెడ్‌పై ఉండే.. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్సాస్: కరోనా బారినపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి.. బెడ్‌పై ఉండే.. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా‌లో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌కు చెందిన మునిజ్, లీమాన్‌లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. జూలైలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో మునిజ్ కరోనా బారినపడ్డాడు. దీంతో అతణ్ణి.. కుటుంబ సభ్యులు జూలై 15న ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో మునిజ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో వైద్యులు అతణ్ణి.. ఐసీయూలో పెట్టి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో మునిజ్ ఆరోగ్యం కాస్త కుదిటపడింది. దీంతో మునిజ్.. తన ప్రియురాలు లీమాన్‌ను ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. లీమాన్ కూడా మునిజ్ నిర్ణయాన్ని స్వాగతించింది. వారి పెళ్లికి కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. వైద్యులు కూడా కాదనలేకపోయారు. దీంతో వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఆగస్ట్ 11న మునిజ్, లీమాన్.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కాగా.. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


Updated Date - 2020-08-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising