న్యూయార్క్ నగర హెల్త్ కమిషనర్గా భారతీయుడు..!
ABN, First Publish Date - 2020-08-05T16:20:15+05:30
అగ్రరాజ్యం అమెరికాలో మరో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది.
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో మరో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్ నగర హెల్త్ కమిషనర్గా ఇండియన్ అమెరికన్ డా. దేవ్ చోక్షి నియమితులయ్యారు. ప్రస్తుతం కరోనా సంక్షోభంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న న్యూయార్క్ నగరం రాబోయే రోజుల్లో దేవ్ సారథ్యంలో ఈ మహమ్మారితో మరింత పటిష్టంగా పోరాడుతోందని నగర మేయర్ బిల్ డే బ్లాసియో ఆయనను నియమించారు.
ఇక అమెరికాలో విలయతాండవం చేస్తున్న మహమ్మారి... న్యూయార్క్లో కూడా విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు న్యూయార్క్లో 2.22 లక్షలకు పైగా మంది కరోనా బారిన పడగా... 23 వేల మంది మరణించారు. కాగా, ఈ నెలలో అక్కడ డైలీ వందలోపు కొత్త కేసులు నమోదు కావడం ఊరటనిచ్చే విషయం. న్యూయార్క్లో వైరస్ కాస్తా తగ్గుముఖం పడుతుండడంతో త్వరలోనే విద్యాసంస్థలు తిరిగి తెరచుకునే అవకాశం ఉంది.
Updated Date - 2020-08-05T16:20:15+05:30 IST