ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లోరిడాలో ఐదు లక్షలు దాటిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-08-06T04:49:28+05:30

ఫ్లోరిడాలో కరోనా కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో ఫ్లోరిడాలో మొత్తం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్లాండో: ఫ్లోరిడాలో కరోనా కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో ఫ్లోరిడాలో మొత్తం 5,409 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,02,739గా ఉంది. అమెరికాలో ఐదు లక్షల కరోనా కేసులు దాటిన రాష్ట్రంగా కాలిఫోర్నియా మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు ఫ్లోరిడా ఆ జాబితాలోకి చేరింది.  మరోపక్క గడిచిన 24 గంటల్లో ఫ్లోరిడా 225 మంది కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 7,627కు చేరుకుంది. అమెరికాలో అనేక రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారాయి. అందులో ఫ్లోరిడా రాష్ట్రం ఒకటి. ఫ్లోరిడాలో గత నెలలో దాదాపు ప్రతి రోజు 9 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతూ వచ్చాయి. గత నాలుగైదు రోజుల నుంచి ఫ్లోరిడాలో కేసుల తగ్గుముఖం కనపడుతోంది. ఇక ఫ్లోరిడాలో ఆసుపత్రులు మొత్తం కరోనా పేషంట్లతో నిండిపోతున్నాయి. ఇప్పటికే 52 ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్స్ ఫుల్ అయిపోయాయి. మరో 38 ఆసుపత్రుల్లో కేవలం పది శాతం బెడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కేవలం 16 శాతం ఐసీయూ బెడ్స్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్టు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా.. అమెరికా వ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు 4,936,836 కరోనా కేసులు నమోదుకాగా.. 160,833 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-08-06T04:49:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising