ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లోరిడాలో రోజురోజుకూ పెరుగుతున్న మరణాలు

ABN, First Publish Date - 2020-07-31T05:13:31+05:30

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం కరోనాకు కేంద్రంగా మారిపోయింది. ఈ రాష్ట్రంలో అత్యధిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్లాండో: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం కరోనాకు కేంద్రంగా మారిపోయింది. ఈ రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులతో పాటు అత్యధిక మరణాలు కూడా నమోదవుతున్నాయి. గడిచిన మూడు రోజుల నుంచి ఫ్లోరిడాలో మరణాల సంఖ్య పెరుగుతూ పోతోంది. మంగళవారం అత్యధికంగా 216 మంది మరణించగా.. బుధవారం ఈ సంఖ్య 253కు చేరింది. కొత్తగా నమోదైన మరణాలతో ఫ్లోరిడాలో ఇప్పటివరకు మొత్తంగా 6,586 మంది మృత్యువాతపడ్డారు. ఇక ఫ్లోరిడాలో ఇప్పటివరకు 4,61,379 కరోనా కేసులు బయటపడ్డాయి. అమెరికాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఫ్లోరిడా రెండో స్థానంలో ఉంది. ఫ్లోరిడాలోని అనేక ఆసుపత్రుల్లో ఇప్పటికే ఐసీయూ బెడ్ల కొరత ఏర్పడింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో న్యూయార్క్ రాష్ట్రం కరోనాకు కేంద్రంగా ఉండేది. కానీ.. ఇప్పుడు అక్కడ పరిస్థితి అదుపులోకి రాగా.. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారాయి. అమెరికాలోని 30కు పైగా రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు 45 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. లక్షా 50 వేల మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు.

Updated Date - 2020-07-31T05:13:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising