ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెస్టారెంట్ కష్టాలు చూసి.. కస్టమర్ రూ. 7.50 లక్షల టిప్

ABN, First Publish Date - 2020-03-27T04:13:37+05:30

కరోనా మహమ్మారి వ్యాప్తిని చూసి అమెరికన్లు వణికిపోతున్నారు. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య వెయ్యి దాటడంతో ఈ పరిస్థితి ఎప్పుడు అదుపులోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్లోరిడా: కరోనా మహమ్మారి వ్యాప్తిని చూసి అమెరికన్లు వణికిపోతున్నారు. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య వెయ్యి దాటడంతో ఈ పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో ఒక్క అమెరికా నుంచే 69,684 కేసులు నమోదయ్యాయి. గురువారం వరకు అమెరికాలో మొత్తంగా 1046 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలో ఇప్పటికే పలు నగరాల్లో లాక్ డౌన్ నడుస్తోంది. ప్రజలను ఇళ్లు కదిలి బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో చిన్న చిన్న వ్యాపారస్తులకు భారీగా నష్టాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా రెస్టారెంట్ వ్యాపారస్తులు ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితిలో కూడా లేరు. 


ఇదిలా ఉండగా.. అనేక చోట్ల రెస్టారెంట్ యజమానుల కష్టాలను చూసి అమెరికన్ల గుండె కదిలిపోతోంది. రెస్టారెంట్ల యజమానుల కష్టాలు చూడలేక కస్టమర్లు వేల డాలర్ల టిప్‌ను ఇస్తూ తమ మంచి మనసును చాటుకుంటున్నారు. తాజాగా ఫ్లోరిడాలోని ఓ ఫుడ్ రెస్టారెంట్‌కు వెళ్లిన కస్టమర్ బిల్లుతో పాటు పది వేల డాలర్ల(దాదాపు రూ. 7.50 లక్షలు) టిప్‌ను ఇచ్చాడు. కనీసం తన పేరు చెప్పడానికి కూడా కస్టమర్ ఇష్టపడలేదని రెస్టారెంట్ యజమాని తెలిపాడు. కస్టమర్ ఇచ్చిన డబ్బును తన 20 మంది ఉద్యోగులకు పంచినట్టు పేర్కొన్నాడు. కరోనా దెబ్బతో కస్టమర్లు రెస్టారెంట్‌కు రావడమే మానేశారని.. ఉద్యోగులకు జీతం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోపక్క అరిజోనాలోని ఓ పిజ్జా షాప్‌కు వెళ్లిన కస్టమర్ బిల్‌తో పాటు 2 వేల డాలర్ల(రూ. లక్ష 49 వేలు) క్యాష్‌ను యజమానికి ఆర్థిక సాయంగా ఇచ్చాడు. 

Updated Date - 2020-03-27T04:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising