ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లోరిడాలో నిత్యం 9 వేలకు తగ్గకుండా కేసులు

ABN, First Publish Date - 2020-08-02T05:19:44+05:30

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం కరోనాకు కేంద్రంగా మారిపోయింది. ఇక్కడ నిత్యం 9

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్లాండో: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం కరోనాకు కేంద్రంగా మారిపోయింది. ఇక్కడ నిత్యం 9 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో చూసుకుంటే ఫ్లోరిడా వ్యాప్తంగా 9,591 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క ఒకే రోజు రాష్ట్రంలో కరోనా కారణంగా 179 మంది మరణించారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఫ్లోరిడాలో మొత్తం కేసుల సంఖ్య 4,80,028కు చేరింది. ఇక మరణాల సంఖ్య 7,022గా ఉంది. ఫ్లోరిడాలో ఇప్పటికే అనేక ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్స్ కొరత ఏర్పడింది. యువత ఫేస్‌మాస్క్ ధరించకపోవడం వల్లే కరోనా వ్యాప్తి చెందుతోందని నిపుణులు మండిపడుతున్నారు. యువత ఫేస్‌మాస్క్ ధరించకపోవడం వల్ల వయసు పైబడిన వారు కరోనా బారిన పడి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్‌ రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడ కరోనా తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతూ పోతోంది. అమెరికాలో నిత్యం నమోదయ్యే కేసుల్లో అత్యధిక కేసులు ఈ రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే అమెరికాలో 67,746 కరోనా కేసులు నమోదుకాగా.. 1,424 మంది మరణించారు. ఇక అమెరికాలో ఇప్పటివరకు 47,35,239 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 1,57,265 మంది మరణించారు.

Updated Date - 2020-08-02T05:19:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising