ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లోరిడాలో ఇక ఇంతేనా? ఆదివారం కూడా..

ABN, First Publish Date - 2020-07-21T04:35:04+05:30

ఫ్లోరిడాను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. గత కొద్ది రోజులుగా ఫ్లోరిడాలో 10 వేలకు తగ్గకుండా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్లాండో: ఫ్లోరిడాను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. గత కొద్ది రోజులుగా ఫ్లోరిడాలో 10 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఫ్లోరిడాలో 10,347 కరోనా కేసులు నమోదైనట్టు ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ సోమవారం వెల్లడించారు. మరోపక్క గడిచిన 24 గంటల్లో ఫ్లోరిడాలో 90 మంది కరోనా కారణంగా మరణించారు. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,60,000 దాటింది. ఇక కొత్తగా నమోదైన మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 5,072గా ఉంది. అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి. ఈ రాష్ట్రాల్లో నిత్యం పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఫ్లోరిడాలో ఇటీవల ఒకేరోజు 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఒకే రాష్ట్రం నుంచి ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు 3,906,812 కేసులు నమోదవగా.. 143,349 మంది కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-07-21T04:35:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising