ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లోరిడాలో అదుపులోకి వస్తున్న మహమ్మారి.. రెండు నెలల తర్వాత మొదటిసారిగా..

ABN, First Publish Date - 2020-09-01T06:35:25+05:30

ఫ్లోరిడాలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తున్నట్టు కనపడుతోంది. గడిచిన 24 గంటల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్లాండో: ఫ్లోరిడాలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తున్నట్టు కనపడుతోంది. గడిచిన 24 గంటల్లో ఫ్లోరిడాలో 1,885 కరోనా కేసులు నమోదుకాగా.. 68 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండున్నర నెలల్లో కేసులు ఇంత తక్కువగా నమోదుకావడం ఇదే మొదటిసారి. జూన్ 15న ఫ్లోరిడాలో 1,758 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతూ పోయింది. నిత్యం పదివేలకు పైగా కేసులు నమోదవుతూ వచ్చాయి. జూలై 12న ఏకంగా 15 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. అమెరికాలో ఒకేరోజు ఒకే రాష్ట్రం నుంచి ఇన్ని వేల కేసులు నమోదుకావడం అదే మొదటిసారి. ఇక ఆ తర్వాత అధికారులు చాకచక్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఈ విధంగా ఇప్పుడు కేసులు రెండు వేల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. అయితే కేసుల సంఖ్య మరింత తగ్గాల్సిన అవసరం ఉందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఫ్లోరిడాలో ఇప్పటివరకు మొత్తం 6,23,471 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 11,187 మంది మృత్యువాతపడ్డారు. ఇక అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 61,95,634 కేసులు నమోదుకాగా.. 1,87,521 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-09-01T06:35:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising