ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లోరిడాలో 45 రోజుల తరువాత కేసుల్లో తగ్గుముఖం

ABN, First Publish Date - 2020-08-11T04:49:10+05:30

ఫ్లోరిడాలో 45 రోజుల తరువాత కరోనా కేసుల్లో తగ్గుదల కనపడుతోంది. ఫ్లోరిడాలో ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్లాండో: ఫ్లోరిడాలో 45 రోజుల తరువాత కరోనా కేసుల్లో తగ్గుదల కనపడుతోంది. ఫ్లోరిడాలో ఆదివారం 4,155 కరోనా కేసులు నమోదయ్యాయి. జూన్ 23 నుంచి ఇప్పటివరకు ఫ్లోరిడాలో ఇంత తక్కువగా ఎన్నడూ కేసులు నమోదుకాలేదు. అమెరికాలో ఒకేరోజు అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా కూడా ఫ్లోరిడా చరిత్ర సృష్టించింది. గత నెలలో ఒకేరోజు ఫ్లోరిడాలో 15 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికా వ్యాప్తంగా ఒకే రాష్ట్రం నుంచి ఒక్కరోజులో ఇన్ని కేసులు ఏ రాష్ట్రంలోనూ నమోదుకాలేదు. ఇక ఆ తర్వాత కేసుల సంఖ్య కొంచెం తగ్గి నిత్యం పదివేల కేసులు నమోదవుతూ వచ్చాయి. ఇక పదివేల నుంచి తొమ్మిది వేలకు.. గత పదిహేను రోజులుగా ఆరు వేలకు అటు ఇటుగా కేసులు బయటపడుతూ వచ్చాయి. ఇక ఆదివారం మాత్రం కేసులు నాలుగు వేలకు వచ్చాయి. దీంతో అధికారులు కొంత ఉపశమనం పొందుతున్నారు. ప్రస్తుతం ఫ్లోరిడాలోని ఆసుపత్రులన్నీ కరోనా పేషంట్లతోనే నిండిపోయాయి. అనేక ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఇక ముందు కూడా కరోనా కేసులు తగ్గుతూ వెళ్తాయని అధికారులు ఆశిస్తున్నారు. కాగా.. ఫ్లోరిడాలో ఇప్పటివరకు మొత్తంగా 5,36,961 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఫ్లోరిడాలో 91 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 8,277కు చేరుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెక్సాస్, జార్జియా రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి.

Updated Date - 2020-08-11T04:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising