ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో పోరాడుతున్న స్నేహితుడిని చూసేందుకు.. అమెరికాలో..

ABN, First Publish Date - 2020-04-06T05:44:25+05:30

అమెరికాలో కరోనా విళయతాండవం ఆడుతోంది. ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 3 లక్షలకు పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. మరోపక్క కరోనా కారణంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మియామి: అమెరికాలో కరోనా విళయతాండవం ఆడుతోంది. ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 3 లక్షలకు పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. మరోపక్క కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 8 వేలు దాటింది. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని చూసేందుకు వీలు లేకపోవడంతో బాధితుల బంధువులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. కొంత మంది వినూత్న పద్దతుల్లో తమ కుటుంబసభ్యులను, స్నేహితులను కలుస్తున్నారు. ఎలా అంటే.. ఇటీవల ఫ్లోరిడాలోని మియామికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తి అగ్నిమాపక శాఖలో పనిచేస్తుండటంతో.. అతడిని చూసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రికి వచ్చారు. అయితే వారికి ఎంట్రీ లేకపోవడంతో.. ఫైర్ ఇంజన్ ద్వారానే తమ స్నేహితుడిని కలిశారు. ఓ వ్యక్తి ఫైర్ ఇంజన్ నిచ్చెన ద్వారా  నాలుగో అంతస్థుకు చేరుకుని కిటికీలో నుంచి తన స్నేహితుడిని పలకరించాడు.


దీంతో ఆసుపత్రిలోని వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. అదే విధంగా బిల్డింగ్ కింద ఉన్న సిబ్బంది మొత్తం తాము అండగా ఉన్నామంటూ బాధితుడికి భరోసానిచ్చారు. తన తోటి ఉద్యోగుల ఆప్యాయతను చూసి బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. తన కోసం స్నేహితులంతా ఈ విధంగా చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. తన స్నేహితులు మాటల్లో చెప్పలేని అనుభూతిని ఇచ్చారని చెప్పుకొచ్చాడు. కాగా.. ఇటీవల అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తన తల్లిని ట్రక్ ద్వారా కలుసుకున్నాడు. లివింగ్ సెంటర్‌లో నివసిస్తున్న తన తల్లిని చూసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో చెట్లను కట్ చేసే ట్రక్ ద్వారా మూడో అంతస్థులో ఉన్న తల్లిని కలిశాడు. 

Updated Date - 2020-04-06T05:44:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising