ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసుపత్రిలో పసిపిల్లవాడు మాయం.. ఫ్లోరిడాలో..

ABN, First Publish Date - 2020-08-09T08:21:03+05:30

ఫ్లోరిడాలో ఓ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా పసివాడి మృతదేహం మాయమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తంపా: ఫ్లోరిడాలో ఓ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా పసివాడి మృతదేహం మాయమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తంపాలోని సెయింట్ జోసఫ్ ఆసుపత్రిలో కేథరిన్, ట్రావిస్ విల్సన్ అనే జంటకు ఫిబ్రవరి నెలలో బాబు జన్మించాడు. అయితే పుట్టిన మూడు రోజులకే వివిధ కారణాల రీత్యా బాబు మరణించాడు. అసలే ఆవేదనలో ఉన్న తల్లిదండ్రులకు చనిపోయిన బాబు కనిపించడం లేదంటూ అప్పుడే మరో చేదు వార్త తెలిసింది. బాబు ఆచూకీ కోసం ఆసుపత్రి ఏమాత్రం ప్రయత్నాలు చేయకపోవడంతో.. జూన్‌లో బాబు తల్లిదండ్రులు ఆసుపత్రి నిర్లక్ష్యంపై దావా వేశారు. ప్రస్తుతం తల్లిదండ్రుల తరపు న్యాయవాది ఆసుపత్రి యాజమాన్యంతో వివిధ అంశాలపై చర్చలు జరుపుతున్నారు. మరోపక్క బాబు మృతిచెందినందుకు తాము సానుభూతి తెలియజేస్తున్నామని ఆసుపత్రి యజమాన్యం చెప్పుకొచ్చింది. అదృశ్యమైన బాబు ఆచూకీ కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదని.. ఇకపై కూడా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. 

Updated Date - 2020-08-09T08:21:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising