ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైట్ ఎంత అని అడిగినందుకు.. అమెరికాలో దారుణంగా..

ABN, First Publish Date - 2020-06-30T03:13:02+05:30

అమెరికాలో ఓ యువకుడిని హైట్ ఎంత అని అడిగినందుకు దారుణంగా ఇ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చికాగో: అమెరికాలో ఓ యువకుడిని హైట్ ఎంత అని అడిగినందుకు దారుణంగా ఇద్దరు యువతులను హత్య చేశాడు. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన చికాగోలో జూన్ 20న చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాసీన్ ఫ్రాన్సిస్(17), చార్లెస్ రిలే(16) అనే యువతులు జూన్ 20న సాయంత్రం 5 గంటల సమయంలో సమీపంలోని క్యాండీ స్టోర్ నుంచి బయటకు వచ్చారు. ఇదే సమయంలో వారికి లారాయ్ బ్యాటిల్(19 ) అనే ఎత్తున్న యువకుడు కనిపించాడు. అతడి దగ్గరుకు వెళ్లి ‘నీ ఎత్తు ఎంత? ఒకరోజు మేము కూడా నీ అంత ఎత్తు ఎదుగుతామని అశిస్తున్నాం’ అని ఇద్దరు యువతులు అన్నారు. అయితే యువతుల మాటలకు లారాయ్‌కు కోపమొచ్చింది. దీంతో యువతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే సమయంలో లారాయ్ ఇద్దరు యువతుల వెనుక వెళ్లి వారిపై ఒక్కసారిగా తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు యువతులు మరణించారు. కాగా.. సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు లారాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో కూడా మూడు సార్లు అరెస్ట్ అయినట్టు పోలీసులు చెబుతున్నారు. మరోపక్క చికాగోలో ఇటువంటి హింసాత్మక ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత వారం చికాగోలో తుపాకీ కాల్పుల్లో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-06-30T03:13:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising