ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కేసుల్లో న్యూయార్క్‌ను దాటేసిన కాలిఫోర్నియా

ABN, First Publish Date - 2020-07-23T22:24:51+05:30

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. మార్చి నెల నుంచి కూడా అత్యధిక కేసుల జాబితాలో అమెరికానే ముందుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. మార్చి నెల నుంచి కూడా అత్యధిక కేసుల జాబితాలో అమెరికానే ముందుంది. అయితే ఆ సమయంలో అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రం కరోనాకు కేంద్రంగా ఉండేది. కానీ.. ఇప్పుడు అక్కడ పరిస్థితి అదుపులోకి రాగా.. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారాయి. ఈ రాష్ట్రాల్లో నిత్యం పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక కాలిఫోర్నియా విషయానికి వస్తే.. న్యూయార్క్‌లో నమోదైన కేసుల సంఖ్యను తాజాగా కాలిఫోర్నియా దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసుల్లో అమెరికా ముందుంటే.. అమెరికాలో అత్యధిక కేసుల విషయంలో ఇప్పుడు కాలిఫోర్నియా ముందు స్థానంలోకి చేరింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం వరకు న్యూయార్క్‌లో 4,03,973 కేసులు నమోదుకాగా.. కాలిఫోర్నియాలో 4,09,305 కేసులు నమోదయ్యాయి. అయితే మరణాల విషయంలో మాత్రం కాలిఫోర్నియా కంటే న్యూయార్క్ రాష్ట్రమే ముందు స్థానంలో ఉంది. ఇక జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కల ప్రకారం.. అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 40 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా బారిన పడి లక్షా 40 వేల మందికి పైగా మరణించారు.

Updated Date - 2020-07-23T22:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising