ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేస్‌మాస్క్ లేకపోతే 1000 డాలర్ల జరిమానా.. ఎక్కడంటే..

ABN, First Publish Date - 2020-04-09T00:09:13+05:30

అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో.. భౌతిక దూరాన్ని పాటించాల్సిందిగా ప్రభుత్వం ప్రజలకు సూచిస్తూనే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో.. భౌతిక దూరాన్ని పాటించాల్సిందిగా ప్రభుత్వం ప్రజలకు సూచిస్తూనే ఉంది. అయితే అనేక చోట్ల భౌతిక దూరం పాటిస్తున్నప్పటికి.. ప్రజలు మాస్క్‌లు మాత్రం ధరించడం లేదు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నాయాలోని రివర్‌సైడ్ కౌంటీ అధికారులు కొత్త నిబంధనలను ఆచరణలోకి తీసుకొస్తున్నారు. రివర్‌సైడ్ కౌంటీలో ఇప్పటివరకు 946 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో బహిరంగ ప్రదేశాలలో ఫేస్ మాస్క్ లేకుండా తిరిగితే వెయ్యి డాలర్ల(రూ. 76 వేలు) జరిమానా చెల్లించాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. జరిమానాతో పాటు కొన్ని సందర్భాల్లో జైలుశిక్ష పడే అవకాశం కూడా ఉందని సీనియర్ అధికారి బియాన్క్ సూచించారు. ఈ ఆదివారం నుంచే నిబంధనలు అమలులోకి వస్తాయన్నారు. ప్రజలకు ఈ నిబంధన ఇబ్బందికరంగా ఉండచ్చని, కరోనాను నియంత్రించాలంటే ఇదొక్కటే మార్గంగా కనపడుతోందని ఆయన అన్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని తాము ఎలాంటి నిషేధం పెట్టలేదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫేస్ మాస్క్‌తో బయటకు రావాలన్నారు. కాగా.. క్యాలిఫోర్నియాలో ఇప్పటివరకు 17,620 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 450 మంది మృతిచెందారు. రాష్ట్రంలో కరోనా కారణంగా రానున్న రోజుల్లో మరింత మంది చనిపోయే అవకాశం ఉందని గవర్నర్ గవిన్ న్యూసమ్ అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-04-09T00:09:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising