ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరు లక్షల కేసులతో కాలిఫోర్నియా కొత్త రికార్డు!

ABN, First Publish Date - 2020-08-15T07:21:36+05:30

ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాక్రమెంటో: ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అయితే అమెరికాలో అత్యధిక కరోనా కేసులు మాత్రం కాలిఫోర్నియాలో నమోదయ్యాయి. తాజాగా కాలిఫోర్నియాలో కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి కాలిఫోర్నియాలో మొత్తం కేసుల సంఖ్య 6,02,997గా ఉంది. అమెరికాలో మరే రాష్ట్రంలోనూ ఇప్పటివరకు 6 లక్షల కేసులు నమోదుకాలేదు. ఈ రాష్ట్రంలో నిత్యం దాదాపు పది వేల కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క కాలిఫోర్నియాలో ఇప్పటివరకు కరోనా కారణంగా 10,999 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల విషయంలో టాప్ స్థానంలో ఉన్నప్పటికి.. మరణాల విషయంలో మాత్రం న్యూయార్క్ రాష్ట్రం 32,805 మరణాలతో అత్యధిక స్థానంలో నిలిచింది. ఇక కాలిఫోర్నియా తరువాత ఫ్లోరిడాలో 5.57 లక్షలకు పైగా కేసులు, టెక్సాస్‌లో 5.3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో ఈ మూడు రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారాయి. అమెరికాలో ఇప్పటివరకు 54 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా.. అందులో దాదాపు 18 లక్షల కేసులు ఈ మూడు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఇక అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు లక్షా 70 వేలకు పైగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-08-15T07:21:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising