ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ట్రంప్ వ్యాఖ్యలు నాకు కోపాన్ని తెప్పించాయి’

ABN, First Publish Date - 2020-07-06T07:40:49+05:30

కరోనా దానంతట అదే అదృశ్యమైపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తనకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్టిన్: కరోనా దానంతట అదే అదృశ్యమైపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తనకు ఆగ్రహం కలిగించినట్టు టెక్సాస్‌లోని ఆస్టిన్ నగర మేయర్ స్టీవ్ ఆడ్లర్ తెలిపారు. దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ట్రంప్ ఇటీవల ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. మరోపక్క ఫేస్‌మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఇప్పటివరకు వైట్‌హౌస్ స్పష్టమైన ప్రకటన కూడా చేయలేదని ఆయన మండిపడ్డారు. వైట్‌హౌస్ ఎటువంటి ప్రకటన చేయకపోతే.. ఫేస్‌మాస్క్ ధరించని, భౌతిక దూరం పాటించని వారి సంఖ్య పెరుగుతూ పోతుందన్నారు. మరోపక్క టెక్సాస్ ప్రభుత్వం గత వారం నుంచి ఫేస్‌మాస్క్ ధరించడం తప్పనిసరి చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. అయితే ఈ ప్రయత్నం ముందుగానే చేసి ఉండాల్సిందని స్టీవ్ ఆడ్లర్ తెలిపారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్థానిక మేయర్లు ఆంక్షలు విధించే అధికారాన్ని గవర్నర్ ఇవ్వాలని ఆయన కోరారు. కాగా.. టెక్సాస్‌‌తో పాటు కాలిఫోర్నియా, ఫ్లోరిడా, అరిజోనా రాష్ట్రాలు ప్రస్తుతం కరోనాకు కేంద్రాలుగా మారాయి. ఈ రాష్ట్రాల్లో నిత్యం ఐదు నుంచి పది వేల కేసులు నమోదవుతున్నాయి. 

Updated Date - 2020-07-06T07:40:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising