ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలిఫోర్నియాలో ఆరని కార్చిచ్చు..!

ABN, First Publish Date - 2020-09-13T00:09:21+05:30

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పడిన కార్చిచ్చు సమీపంలోని నివాస ప్రాంతాలను సైతం చుట్టుముట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

10 మంది వరకు మృతి

2వేలకు పైగా ఇళ్లు బుగ్గిపాలు

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పడిన కార్చిచ్చు సమీపంలోని నివాస ప్రాంతాలను సైతం చుట్టుముట్టింది. ఈ కార్చిచ్చు వల్ల 10 మంది వరకు మృతి చెందగా, మరో 16 మంది వరకు కనిపించకుండా పోయారు. 2వేలకు పైగా ఇళ్లు బుగ్గిపాలయ్యాయి. ఆగస్టులో పిడుగు పాట్లకు అడువుల్లో రాజుకున్న మంటలు నెమ్మదిగా వ్యాపించి కార్చిచ్చుగా మారాయి. మంటలకు గాలులు తోడుకావడంతో ఈ కార్చిచ్చు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఇప్పుడీ మంటలు కాలిఫోర్నియా నుంచి ఓరేగాన్, వాషింగ్టన్‌‌లకు వ్యాపించాయని అధికారులు తెలిపారు. వీటిని అదుపులోకి తెచ్చేందుకు సుమారు 14వేల అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కాగా, ఇప్పటికే అపార ఆస్తి నష్టం జరిగిందని సమాచారం. 


ఇక ఓరెగానేలో మంటలు మరింత తీవ్రరూపం దాల్చడంతో అక్కడ ఉంటున్న సుమారు ఐదు లక్షల మందిని శుక్రవారం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఓరెగాన్ రాష్ట్రంలోని ఐదు పట్టణాలు సహా 9లక్షల ఎకరాలు బుగ్గిపాలైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఓరెగాన్ రాష్ట్రంలో కార్చిచ్చు సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన డ్రోన్ వీడియోను అక్కడి అధికారులు తాజాగా విడుదల చేశారు. అలాగే మెలిల్లా నగరమైతే మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న 9వేల మందిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. 

Updated Date - 2020-09-13T00:09:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising