ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్లోరోక్విన్ డ్రగ్ నేరుగా తీసుకుని అమెరికన్ మృతి

ABN, First Publish Date - 2020-03-25T04:07:58+05:30

కరోనాను క్లోరోక్విన్ డ్రగ్ నయం చేసే అవకాశమున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో.. వాటిని నేరుగా తీసుకుని ఓ వ్యక్తి మరణించాడు. అరిజోనాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరిజోనా: కరోనాను క్లోరోక్విన్ డ్రగ్ నయం చేసే అవకాశమున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో.. వాటిని నేరుగా తీసుకుని ఓ వ్యక్తి మరణించాడు. అరిజోనాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అరవై ఏళ్లు పైబడిన భార్యాభర్తలు ఈ క్లోరోక్విన్ ఫాస్‌ఫేట్‌ను తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్ తీసుకున్న వెంటనే వారిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని పేర్కొన్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. భర్త మృతి చెందినట్టు చెప్పారు. భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్‌ డ్రగ్స్ కలయిక మెడికల్ చరిత్రను మార్చేస్తుందంటూ శనివారం ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. మలేరియాకు వాడే క్లోరోక్విన్‌ను ఏ ఒక్కరూ కరోనాకు వ్యాక్సిన్‌లా భావించి వేసుకోవద్దంటూ వైద్యులు హెచ్చరించారు. కాగా.. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19ను తగ్గించేందుకు ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు వ్యాక్సిన్ ప్రయోగాలలో నిమగ్నమైనప్పటికీ.. పూర్తి ఫలితాలు రావడానికి కనీసం ఏడాది సమయమైనా పడుతుంది.

Updated Date - 2020-03-25T04:07:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising