ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెల్ల పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయుడు

ABN, First Publish Date - 2020-05-27T23:46:02+05:30

నల్ల జాతీయుడి మరణానికి కారణమైన నలుగురు పోలీసు అధికారులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: నల్ల జాతీయుడి మరణానికి కారణమైన నలుగురు పోలీసు అధికారులను విధుల నుంచి తొలగించినట్టు మిన్నెపొలిస్ మేయర్ జాకొబ్ ఫ్రే వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఫోర్జరీ కేసులో నలుగురు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని రోడ్డుపై పడుకోబెట్టి.. ఓ తెల్ల పోలీసు అధికారి అతడి మెడపై మోకాలు పెట్టి ఉంచారు. ఇదే సమయంలో తనకు ఊపిరి ఆడటం లేదంటూ నిందితుడు మొత్తుకున్నాడు. అయినప్పటికి పోలీసు అధికారి మాత్రం వినలేదు. ఇలా దాదాపు ఐదు నిమిషాల పాటు మెడపై మోకాలు పెట్టి ఉంచడంతో జార్జ్ ఫ్రాయిడ్ స్పృహ తప్పిపోయాడు. అనంతరం పోలీసులు అతడిని పిలిచినప్పటికి ఎటువంటి చలనం లేదు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్టు డాక్టర్లు నిర్థారించారు. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఒక్కసారిగా వైరల్ అయిపోయింది.


మిన్నెపొలిస్ మేయర్ జాకొబ్ కూడా ఈ వీడియోను చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెల్ల పోలీసు అధికారి చేసింది చాలా పెద్ద తప్పు అని.. ఐదు నిమిషాల పాటు మెడపై ఊపిరి ఆడకుండా మోకాలు పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఘటన సమయంలో విధుల్లో ఉన్న నలుగురు అధికారులను వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు జాకొబ్ ట్వీట్ చేశారు. ఈ కేసును ఎఫ్‌బీఐకి అప్పగించినట్టు మెన్నెపొలిస్ పోలీస్ చీఫ్ మెడారియా అర్రాడాండో తెలిపారు. మరోపక్క నల్ల జాతీయుడి చావుకు కారణమైన తెల్ల పోలీసు అధికారులపై అమెరికా నలుమూలల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి.


Video Credits: ABC7


Updated Date - 2020-05-27T23:46:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising