ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో మరో ఘోరం... తుపాకి తూటాలకు ఏడేళ్ల చిన్నారి బలి

ABN, First Publish Date - 2020-08-31T22:57:46+05:30

అమెరికాలో గన్ వయిలెన్స్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇండియానా రాష్ట్రంలో తుపాకీ తూటాలకు అభం శుభం తెలియని ఏడేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సౌత్ బెండ్ ప్రాంతంలోని స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు శనివారం బాలిక వెళ్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌత్ బెండ్, ఇండియానా: అమెరికాలో గన్ వయిలెన్స్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇండియానా రాష్ట్రంలో తుపాకీ తూటాలకు అభం శుభం తెలియని ఏడేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సౌత్ బెండ్ ప్రాంతంలోని స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు శనివారం బాలిక వెళ్లింది. తన స్నేహితులతో కలిసి ఇంటి బయట బాలిక ఆడుకుంటుండగా.. దుండగులు కారులో వెళ్తూ బాలికపై కాల్పులు జరిపారు. వెంటనే బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నప్పటికి.. కారులో వెళ్తూ దుండగులు ఒక్క బాలికపైనే కాల్పులు జరిపినట్టు అక్కడున్న వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇటీవల జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడు హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి అమెరికా వ్యాప్తంగా బ్లాక్ లివ్స్ మేటర్ పేరిట అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఉద్యమాల నేపథ్యంలో అమెరికాలో గన్ వయిలెన్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-08-31T22:57:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising