ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు ఉల్లంఘించి.. జైలుపాలయ్యారు..!

ABN, First Publish Date - 2020-12-01T00:23:28+05:30

అమెరికాలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేయడానికి అక్కడి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం కొవిడ్‌ను తేలిగ్గా తీసుకుంటూ.. యథేచ్చగా రూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: అమెరికాలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేయడానికి అక్కడి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం కొవిడ్‌ను తేలిగ్గా తీసుకుంటూ.. యథేచ్చగా రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ సిటీలోని ఓ క్లబ్‌లో కొవిడ్ నిబంధనలను అతిక్రమించి చట్టవిరుద్ధంగా పార్టీ చేసుకుంటున్న 400 మంది అమెరికన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టవిరుద్ధంగా కొంత మంది న్యూయార్క్ సిటీలోని ఓ క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం 3 గంటలకు అక్కడకు చేరుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి పార్టీ చేసుకుంటున్న వారితోపాటు దాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. పార్టీలో పాల్గొన్న వారిలో చాలా మంది కనీసం మాస్కులు కూడా ధరించలేదని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. న్యూయార్క్‌లో ఇప్పటి వరకు 6.79లక్ష ల మంది కొవిడ్ బారినపడగా.. 34,514 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-12-01T00:23:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising