ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుపాకీని ఆడుకునే బొమ్మ అనుకుని.. మూడేళ్ల బాలుడు..

ABN, First Publish Date - 2020-10-12T08:17:00+05:30

అమెరికాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆరెగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలోహ, ఆరెగాన్: అమెరికాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆరెగాన్ రాష్ట్రంలో అభంశుభం తెలియని మూడేళ్ల బాలుడు తుపాకీతో తనను తానే కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. గత శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో బాలుడు ఆడుకుంటూ బెడ్‌రూంలోకి వెళ్లాడు. ఇదే సమయంలో టేబుల్ డ్రాయర్ లోపల ఉన్న తుపాకీని చూసి బయటకు తీశాడు. ఆట వస్తువు అనుకుని తలకు తుపాకీని పెట్టుకుని కాల్చుకున్నాడు. అంతే.. ఒక్కసారిగా ఉన్న చోటనే కుప్పకూలిపోయాడు. బుల్లెట్ శబ్దం విన్న తల్లిదండ్రులు బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. మూడేళ్ల బాలుడు మృతదేహాన్ని చూసిన పోలీసులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనలో ఎవరిపై కేసు నమోదు చేయనప్పటికి.. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  

Updated Date - 2020-10-12T08:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising