ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్దుడిపై దాడి చేసినందుకు.. ఇద్దరు పోలీసు అధికారులు సస్పెండ్

ABN, First Publish Date - 2020-06-07T05:55:44+05:30

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 75 ఏళ్ల వృద్దుడిపై దాడి చేసినందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 75 ఏళ్ల వృద్దుడిపై దాడి చేసినందుకు ఇద్దరు పోలీసు అధికారులపై సెకండ్ డిగ్రీ అసాల్ట్(దాడి) కింద కేసు నమోదైంది. న్యూయార్క్ నగరంలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైనున్న వీడియోను గమనిస్తే.. వయసు పైబడిన వ్యక్తిని ఓ పోలీసు అధికారి బలంగా వెనక్కు నెట్టడం స్పష్టంగా కనపడుతోంది. బాధితుడు పేరు మార్టిన్ గుగినో అని.. ఘటన జరిగిన సమయంలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నట్టు అధికారులు తెలుసుకున్నారు. మార్టిన్‌ను వెనక్కు నెట్టడంతో.. ఒక్కసారిగా కింద పడి తలకు గాయమై రక్తం రావడం కూడా వీడియోలో గమనించవచ్చు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నట్టు తెలుస్తోంది.


ఈ వీడియో వైరల్ కావడంతో ఘటనకు కారణమైన రాబర్ట్ మెక్‌కేబ్, ఆరన్ టార్‌గాల్స్కీ అనే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి సెకండ్ డిగ్రీ అసాల్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ జైలు నుంచి విడుదల కాగా.. జులై 20న కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే వీరిద్దరూ తమపై పెట్టిన కేసును వ్యతిరేకిస్తున్నారు. వీరికి మద్దతుగా 57 మంది పోలీసు అధికారులు కూడా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కాగా.. ఈ సంఘటనపై న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో స్పందించారు. అధికారులను సస్పెండ్ చేయడాన్ని ఆయన ప్రశంసించారు. ఇద్దరు అధికారులపై క్రమశిక్షణ చర్యలను తీసుకోవాలన్నారు. బాధితుడితో కూడా తాను మాట్లాడానని.. ఎంతో కాలం నుంచి అతడు శాంతియుతంగా చేపట్టే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాడని తెలిపారు.


Video Credits: 6abc Philadelphia

Updated Date - 2020-06-07T05:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising