ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను జయించిన 102 ఏళ్ల బామ్మ.. అమెరికాలో..

ABN, First Publish Date - 2020-05-20T00:17:26+05:30

అమెరికాలో 102 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. గ్రీస్‌కు చెందిన సోఫీ అవోరిస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన్‌ హాట్టన్: అమెరికాలో 102 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. గ్రీస్‌కు చెందిన సోఫీ అవోరిస్ న్యూయార్క్‌లోని మన్ హాట్టన్‌లో నివసిస్తోంది. సోఫీ మార్చి నెలలో హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకుంది. అదే సమయంలో ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో.. సోఫీ కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఆరు వారాల పాటు ఎటువంటి లక్షణాలు లేకపోయినా సోఫీ కరోనా బారిన పడినట్టు వైద్యులు తెలిపారు. కరోనా సోకిన తరువాత తన తల్లిని చూసేందుకు కూడా వైద్యులు నిరాకరించారని సోఫీ కూతురు ఐఫీ తెలిపింది. పరిస్థితి చేయి దాటితే చివరిచూపు చూసుకునేందుకు అనుమతిస్తామని వైద్యులు తమతో చెప్పినట్టు ఐఫీ పేర్కొంది. కరోనా కారణంగా ఎక్కువగా 60 ఏళ్ల పైబడిన వారే మరణిస్తుండటంతో.. తాము కూడా తన తల్లి ఇక బతకదనే నిర్ణయానికి వచ్చేశామని చెప్పింది. అయితే 102 ఏళ్ల వయసున్నప్పటికి రెండు వారాల్లోనే సోఫీ ఆరోగ్యం కుదుటపడింది.  కరోనా సోకినా సోఫీ ఎక్కడా ఆవేదన చెందలేదని.. ఆమె నిజంగా ఫైటర్ అంటూ చికిత్స అందించిన డాక్టర్ తైముర్ మీర్జా చెబుతున్నారు. సోఫీ నిత్యం పక్కనున్న వారిని నవ్విస్తూనే ఉంటుందని తెలిపారు. ఆమెకు ఇంగ్లీషు రాదని కేవలం గ్రీక్ మాత్రమే మాట్లాడేదని.. తాము గూగుల్ ట్రాన్స్‌లేట్ ద్వారా అర్థం చేసుకునేవాళ్లమని పేర్కొన్నారు.

Updated Date - 2020-05-20T00:17:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising