ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫౌంటెన్‌లో నాణేల గుట్టలు.. ఎక్కడో తెలుసా!

ABN, First Publish Date - 2020-08-16T04:10:46+05:30

అమెరికాలోని నార్త్ కరోలినా అక్వేరియం గురించి మీకు తెలిసే ఉంటుంది. అక్వేరియంలో ఉన్న స్మోకీ మౌంటెన్ నుంచి కిందకు జారే వాటర్ ఫాల్స్‌కు ఒక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలోని నార్త్ కరోలినా అక్వేరియం గురించి మీకు తెలిసే ఉంటుంది. అక్వేరియంలో ఉన్న స్మోకీ మౌంటెన్ నుంచి కిందకు జారే వాటర్ ఫాల్స్‌కు ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు 30 అడుగుల లోతైన వాటర్‌ఫాల్స్‌లో నాణేలు వేసి.. ఏమైనా కోరుకుంటే, అది జరుగుతుందనే నమ్మకం అక్కడి ప్రజల్లో ఉంది. దీంతో ప్రతిరోజు కొన్ని వేల మంది ప్రజలు ఆ అక్వేరియంను సందర్శించి.. 30 అడుగుల లోతైన వాటర్ ఫాల్స్‌లోనాణేలు వేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే కరోనా నేపథ్యంలో అక్వేరియం మూతపడింది. ఈ క్రమంలో సందర్శకులు వేసిన నాణేలను వాటర్ ఫాల్స్ ఫౌంటెన్‌లో నుంచి బయటికి తీయాలని నిర్వహకులు భావించారు. ఇందులో భాగంగా.. కొంత మంది సిబ్బంది ఫౌంటెన్‌లో ఉన్న నాణేలను బయటికి తీశారు. కాగా.. ఫౌంటెన్‌లో దాదాపు 100 గాలన్ల నాణేలు లభించినట్లు నిర్వహకులు తెలిపారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో నాణేల ఫొటోలను పోస్ట్ చేసిన ఫౌంటెన్ నిర్వహకులు.. నాణేలు ఎంత విలువ చేస్తాయో చెప్పగలరా? అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. దీంతో నాణేల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా.. నిర్వహకుల ప్రశ్నపై స్పందిస్తున్న నెటిజన్లు.. వారికి తోచిన విధంగా కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫౌంటెన్‌లో లభించిన ఈ డబ్బును.. అక్వేరియం, జంతుల సంరక్షణకు ఉపయోగించనున్నట్లు నిర్వహకులు తెలిపారు.


Updated Date - 2020-08-16T04:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising