ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జార్జ్ ఫ్లాయిడ్ హత్యలో మిగిలిన ముగ్గురు అధికారులను దోషులగా గుర్తించిన కోర్టు

ABN, First Publish Date - 2020-06-05T01:06:13+05:30

నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యలో మిగిలిన ముగ్గురు పోలీసు అధికారులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిన్నెపొలిస్: నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యలో మిగిలిన ముగ్గురు పోలీసు అధికారులను సైతం కోర్టు దోషులుగా గుర్తించింది. జార్జ్ ఫ్లాయిడ్‌ మే 25న డెరెక్ చావిన్ అనే పోలీసు అధికారి కారణంగా ఊపరి ఆడక మరణించాడు. ఇదే సమయంలో అక్కడే మరో ముగ్గురు పోలీసు అధికారులు ఉన్నారు. హత్యకు కారణమైన చావిన్‌పై మాత్రమే మొదట థర్డ్ డిగ్రీ మర్డర్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నలుగురికి శిక్ష పడాల్సిందేనంటూ జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబం డిమాండ్ చేసింది. నిరసనకారులు సైతం నలుగురు పోలీసు అధికారులకు శిక్ష పడాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. హత్య సమయంలో చావిన్‌కు మిగిలిన ముగ్గురు అధికారులు సహాయ పడినట్టు కోర్టు తేల్చింది. ఎట్టకేలకు మిగిలిన ముగ్గురు పోలీసు అధికారులు కూడా దోషులేనంటూ మిన్నెసొటా అటార్ని జనరల్ కీత్ ఎల్లిసన్ బుధవారం తీర్పిచ్చారు. న్యాయ మార్గంలో ఈ తీర్పు మరో ముందడుగు అని జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబ తరపు న్యాయవాది బెంజామిన్ కూప్ ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. చావిన్‌పై నమోదైన థర్డ్ డిగ్రీ మర్డర్‌ కేసును సెకండ్ డిగ్రీ మర్డర్‌ కింద మార్చుతూ కోర్టు తీర్పునిచ్చింది. థర్డ్ డిగ్రీ మర్డర్‌తో పోల్చితే సెకండ్ డిగ్రీ మర్డర్‌ కింద జైలుశిక్ష 15 ఏళ్లు ఎక్కువగా పడుతుంది. దీంతో చావిన్‌కు దాదాపు నలభై ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు కనపడుతున్నాయి. 

Updated Date - 2020-06-05T01:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising