ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్షయ పాత్ర ఔదార్యం.. అమెరికాలో..!

ABN, First Publish Date - 2020-08-03T14:00:40+05:30

అన్నార్తుల ఆకలి తీర్చే ‘అక్షయ పాత్ర’ ఫౌండేషన్‌ మరోసారి తన ఉదారతను చాటుకొంది. భారత్‌లోని పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి ఆ సంస్థ అమెరికాలో ఆన్‌లైన్‌ ద్వారా రూ.7 కోట్ల 11 లక్షల విరాళాలను సేకరించింది. ‘వర్చువల్‌ గాలా-టెక్నాలజీ ఫర్‌ చేంజ్‌’ పేరుతో అక్షయ పాత్ర సంస్థ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భారత బడుల్లో మధ్యాహ్న భోజనం కోసం 
  • అమెరికాలో రూ.7 కోట్ల 11 లక్షల సేకరణ

హ్యూస్టన్‌, ఆగస్టు 2: అన్నార్తుల ఆకలి తీర్చే ‘అక్షయ పాత్ర’ ఫౌండేషన్‌ మరోసారి తన ఉదారతను చాటుకొంది. భారత్‌లోని పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి ఆ సంస్థ అమెరికాలో ఆన్‌లైన్‌ ద్వారా రూ.7 కోట్ల 11 లక్షల విరాళాలను సేకరించింది. ‘వర్చువల్‌ గాలా-టెక్నాలజీ ఫర్‌ చేంజ్‌’ పేరుతో అక్షయ పాత్ర సంస్థకు చెందిన టెక్సస్‌ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు, దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు విరాళాలను అందజేశారు. టెక్సస్‌ రాష్ట్రంలోని ఆస్టిన్‌, డాలస్‌, హ్యూస్టన్‌ నగరాల్లో జూలై 25న ఈ కార్యక్రమం జరిగింది. ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఇటీవలే అక్షయ పాత్ర చైర్మన్‌గా నియమితులైన వెస్టర్న్‌ డిజిటల్‌ అధ్యక్షుడు శివ శివరాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌లోని 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 19,039 పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులకు రోజూ మధ్యాహ్న భోజనం అందించే ఏకైక స్వచ్ఛంద సంస్థ అక్షయ పాత్ర ఫౌండేషనే.

Updated Date - 2020-08-03T14:00:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising