ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

143 మంది భారతీయులతో ఇండోర్ చేరిన ప్రత్యేక విమానం!

ABN, First Publish Date - 2020-07-03T05:43:07+05:30

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులను ఇండియాకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. విదేశాల్లో చిక్కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులను ఇండియాకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. విదేశాల్లో చిక్కుకున్న వారిని ఇండియాకు తరలించేందుకు భారత ప్రభుత్వం మే 7న ‘వందే భారత్ మిషన్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా.. లాక్‌డౌన్ కారణంగా మాస్కోలో చిక్కుకున్న  143 మంది భారతీయులు.. ఈ మిషన్‌లో భాగంగా నిన్న ఇండియాకు చేరుకున్నారు. 143 మందితో బయల్దేరిన ప్రత్యేక విమానం.. ఇండోర్‌లోని దేవీ అహిల్య బాయి హోల్కర్ విమానాశ్రయంలో నిన్న ల్యాండ్ అయింది. 143 మందిలో 24 మంది ఇండోర్‌కు చెందిన వారు ఉండగా.. వారిని క్వారెంటైన్ కేంద్రాలకు తరలించినట్లుగా ఇండోర్ ప్రాంత కరోనా వైరస్ నోడల్ అధికారి డాక్టర్ అమిత్ చెప్పారు. మిగిలిన ప్రయాణికులు.. వారివారి జిల్లాలకు చేరుకున్న తర్వాత క్వారెంటైన్ కేంద్రాలకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. 


Updated Date - 2020-07-03T05:43:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising