ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిసెంబర్ 31 వరకు యూఏఈ నుంచి భారత్‌కు టికెట్ బుకింగ్స్

ABN, First Publish Date - 2020-10-19T13:08:04+05:30

బడ్జెజ్ క్యారియర్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ యూఏఈ నుంచి భారతదేశానికి వచ్చే విమానాలకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ డిసెంబర్ 31 వరకు ఓపెన్ ఉంటాయని ఆదివారం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బడ్జెజ్ క్యారియర్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ యూఏఈ నుంచి భారతదేశానికి వచ్చే విమానాలకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ డిసెంబర్ 31 వరకు ఓపెన్ ఉంటాయని ఆదివారం ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర చేపట్టిన 'వందే భారత్ మిషన్' ఏడో దశలో భాగంగా యూఏఈ నుంచి ఇండియా వచ్చే వారి కోసం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఈ టికెట్లను ఎయిర్‌లైన్ అధికారిక వెబ్‌సైట్ లేదా కాల్‌సెంటర్ ద్వారా గానీ, అధీకృత ట్రావెల్ ఏజెంట్ వద్ద గానీ కొనుగోలు చేయొచ్చని ఎయిర్‌లైన్ తన ట్వీట్‌లో పేర్కొంది. 


ఈ నెలలో(అక్టోబర్ 1 నుంచి 25 వరకు) ఎయిరిండియా యూఏఈ నుంచి స్వదేశానికి రావాలనుకునే భారత ప్రవాసుల కోసం 270 రిపాట్రియేషన్ విమానాలు నడపనుంది. అలాగే భారత్‌లోని వివిధ నగరాల నుంచి యూఏఈకి 269 విమానాలు వెళ్లనున్నాయి. కాగా, కొన్ని గల్ఫ్ దేశాల్లో భారతదేశం నుంచి వెళ్లే ఇన్‌బౌండ్ విమానాలపై నిషేధం విధించిన కారణంగా, ఆ దేశాలకు చెందిన వేలాది మంది ప్రవాస కార్మికులు ఇప్పుడు యూఏఈ ద్వారా ప్రయాణించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా టికెట్ల బుకింగ్స్‌ గడువును పెంచింది.   


Updated Date - 2020-10-19T13:08:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising