ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధుల ప్రాణాలు గాలికి!

ABN, First Publish Date - 2020-04-06T13:11:51+05:30

తల్లిదండ్రులను, తాత ముత్తాతలను గౌరవించే గొప్ప సమాజాల్లో స్పెయిన్‌ ఒకటి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాడ్రిడ్‌, ఏప్రిల్‌ 5: తల్లిదండ్రులను, తాత ముత్తాతలను గౌరవించే గొప్ప సమాజాల్లో స్పెయిన్‌ ఒకటి. ఇక్కడి కుంటుంబ వ్యవస్థలో వృద్ధుల పాత్ర చాలా కీలకం. అలాంటి స్పెయిన్‌లో కరోనా మహమ్మారి మానవ సంబంధాలను చిదిమేస్తోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న పాజిటివ్‌ కేసులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. సామర్థ్యానికి మించి రోగులు వస్తుండడంతో వైద్యసిబ్బంది కూడా చికిత్స అందించలేకపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక వృద్ధులను తిప్పి పంపించేస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే ఆస్పత్రుల్లో చేరిన వారినయితే పట్టించుకోవడం మానేస్తున్నారు.


యువకులకు ఐసీయూలో చేర్చయినా వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కేర్‌ హోమ్స్‌లోనూ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. వృద్ధుల యోగ క్షేమాలను చూసుకునేందుకు తగినంత సిబ్బంది లేకపోవడంతో అనేకమంది వారున్న మంచాలపైనే ప్రాణాలు విడుస్తున్నారు. క్రిమి సంహారక మందులు చల్లేందుకు వెళ్తున్న సైనికులకు చనిపోయినవృద్ధులు దర్శనమిస్తున్నారు. స్పెయిన్‌లో ఇప్పటి వరకూ 1.24 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదవగా.. వారిలో 11,700 మందికిపైగా మరణించారు. 

Updated Date - 2020-04-06T13:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising