ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జో బైడెన్, కమలా హ్యారిస్‌లకు మద్దతు తెలిపిన ప్రముఖ హాలీవుడ్ నటుడు

ABN, First Publish Date - 2020-09-28T07:11:09+05:30

డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్ష రేసులో ఉన్న జో బైడెన్, కమలా హ్యారిస్‌లకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్ష రేసులో ఉన్న జో బైడెన్, కమలా హ్యారిస్‌లకు ప్రముఖ హాలీవుడ్ నటుడు, రెజ్లర్ డ్వైన్ జాన్సన్(ది రాక్) తన మద్దతు తెలిపారు. అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్‌ను తాను ఆమోదిస్తున్నట్టు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చారు. అమెరికా ఎన్నికలకు ఇంకా ఐదు వారాల సమయమే ఉందని.. ఇంతటి క్లిష్టమైన ఎన్నికలను దశాబ్దాల నుంచి చూడలేదని అన్నారు. ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ తాను ఏ ఒక్క పార్టీకి మద్దతు తెలపలేదని డ్వైన్ జాన్సన్ పేర్కొన్నారు. 


ఈసారి మాత్రం జో బైడెన్, కమలా హ్యారిస్‌లు మాత్రమే దేశాన్ని సమర్థంగా నడిపగలరని తాను భావిస్తున్నట్టు డ్వైన్ జాన్సన్ చెప్పారు. అంతేకాకుండా జో బైడెన్, కమలా హ్యారిస్‌లతో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను సైతం ఆయన పోస్ట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే అమెరికా ప్రజల ఆదరణను ఏ విధంగా పొందుతారంటూ ఈ వీడియోలో డ్వైన్ జాన్స్ జో బైడెన్, కమలా హ్యారిస్‌లను అడిగారు. తాము ఏదైతే చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చామో.. వాటిని అమలు చేసి ప్రజల నమ్మకాన్ని పొందుతామని జో బైడెన్, కమలా హ్యారిస్ అన్నారు.

Updated Date - 2020-09-28T07:11:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising