ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘యూఏఈలోని భారతీయుల్లారా.. ప్రభుత్వ ఆదేశాలు పాటించండి’

ABN, First Publish Date - 2020-03-29T23:03:12+05:30

కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కూడా విమాన సర్వీసులు, ప్రజలపై ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో యూఏఈలోని భారత అంబాసిడర్ పవన్ కపూర్.. అక్కడి భారతీయులకు కీలక సూచనలు చేశారు. కరోనా కట్టడి కోసం యూఏఈ ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను భారతీయులంతా విధిగా పాటించాలని పేర్కొన్నారు. అందరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. దుబాయ్‌, అబుధాబి, నార్త్ ఎమిరేట్స్‌ సహా పలు ప్రాంతాల్లో అందించే పాస్‌పోర్ట్ సేవలను కూడా తాత్కాలికంగా రద్దు చేసిటన్లు వెల్లడించారు. అత్యవసర సందర్భాల్లో కూడా కార్యాలయాలకు వెళ్లకుండా.. ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ సంప్రదించాలని తెలిపారు. భారత్‌లో కూడా ప్రధాని నరేంద్ర‌మోదీ దేశ వ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ సహకరిస్తే కరోనా కచ్చితంగా కట్టడి చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా.. యూఏఈలో ఇప్పటి వరకు 468 మంది కరోనా బారిన పడగా.. ఇద్దరు మరణించారు. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2020-03-29T23:03:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising