ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎనిమిదేళ్ల బాలిక.. 80ఏళ్ల వృద్ధాప్యంలో మరణం..!

ABN, First Publish Date - 2020-02-16T23:24:28+05:30

ఎనిమిదేళ్ల బాలిక.. 80 ఏళ్ల వృద్ధాప్య వయసులో మరణించిన ఘటన ఉక్రెయిన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అన్నా సాకిడాన్(8) , ప్రొగేరియా అనే జన్యు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎనిమిదేళ్ల బాలిక.. 80 ఏళ్ల వృద్ధాప్య వయసులో మరణించిన ఘటన ఉక్రెయిన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అన్నా సాకిడాన్(8) , ప్రొగేరియా అనే జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతోంది. ఆ చిన్నారి వయసు వాస్తవానికి ఎనిదేళ్లే అయినా..  వ్యాధి కారణంగా ఆమె బయోలాజికల్ వయసు 80ఏళ్లుగా ఉంది. దీంతో పాప ఒంట్లోని కొన్ని అవయవాలు పని చేయకపోవడంతో తుదిశ్వాస విడిచింది. కాగా.. తమ పాప గత నెలలోనే 8వ వసంతంలోకి అడుగుపెట్టినట్లు అన్నా సాకిడాన్ తల్లిదండ్రులు తెలిపారు. పుట్టిన రోజు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలా ఉంటే ఈ అరుదైన వ్యాధితో బాధపడే వారు ప్రపంచ వ్యాప్తంగా 160 మంది మాత్రమే ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు. 


Updated Date - 2020-02-16T23:24:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising