ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ - 19: గల్ఫ్ దేశాల్లో ఒక్కరోజే ఏడుగురు భారతీయులు మృతి

ABN, First Publish Date - 2020-05-27T02:36:21+05:30

కొవిడ్-19 కారణంగా మంగళవారం ఒక్క రోజే గల్ఫ్ దేశాల్లో ఏడుగురు భారతీయులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: కొవిడ్-19 కారణంగా మంగళవారం ఒక్క రోజే గల్ఫ్ దేశాల్లో ఏడుగురు భారతీయులు మరణించారు. ఈ ఏడుగురు కూడా కేరళ రాష్ట్రానికి చెందిన వారేనని అధికారులు తెలిపారు. రియాద్‌లో ప్లంబర్‌గా పనిచేస్తూ వచ్చిన అబ్దుస్సలామ్(44) అనే వ్యక్తి సులేమాన్ హబీబ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అబ్దుస్సలామ్ అంతకుముందు నుంచే కిడ్నీల సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యులు పేర్కొన్నారు. కువైట్‌లో కేరళకు చెందిన అజయన్ అనే మరో భారతీయుడు మంగళవారం చనిపోయాడు. కరోనా పాజిటివ్ అని తెలిసిన ఆరు రోజులకే అజయమ్ మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. మరోపక్క దోహలో సెయితలీ కుట్టీ(69) అనే మహిళ మరణించింది. అబూధాబీలో గత రెండు వారాల నుంచి చికిత్స పొందుతున్న శిభు(31) అనే భారతీయుడు కూడా మంగళవారం మరణించాడు. గత వారం నుంచి దుబాయిలో చికిత్స పొందుతూ వచ్చిన బినిల్ అనే వ్యక్తి కూడా కరోనా కారణంగానే మృతిచెందాడు. వీరితో పాటు అబూధాబీకి చెందిన ఇసాహక్(44) అనే వ్యక్తి, మరో కేరళ వాసి కూడా ప్రాణాలు కోల్పోయారు. గత రెండు రోజుల్లో  గల్ఫ్ దేశాల్లో కేరళకు చెందిన వారే 23 మంది మరణించినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కలతో గల్ఫ్ దేశాల్లో ఇప్పటివరకు చనిపోయిన కేరళ వాసుల సంఖ్య 125కు చేరింది.

Updated Date - 2020-05-27T02:36:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising